calender_icon.png 24 May, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

24-05-2025 08:27:06 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ  కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు శనివారం ప్రకటించారు. 74,374 మంది భక్తులు నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 37,477 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.