calender_icon.png 12 September, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయాపంట రైతుల ఆందోళన

16-12-2024 01:50:00 AM

కామారెడ్డి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): సోయా పంటను అమ్మడానికి వెళ్లిన రైతులకు చుక్కెదురైంది. ఆదివారం కామారెడ్డి జిల్లా మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రంలో రైతులకు సోయా పంట అమ్మేందుకు వెళ్లారు. అధికారులు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపడంతో రైతులు ఆందోళన చేపట్టారు.

తేమశాతం చూశాకే అధికారులు పంటను కొన్నారని, ఇప్పుడేమో తేమను సాకుగా చూపుతూ వెనక్కి పంపించడమేమిటని ప్రశ్నించారు. వాపస్ పంపిన సోయాను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.