calender_icon.png 10 September, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా

16-12-2024 01:50:51 AM

* 13 జిల్లాల్లో భారీగా  తగ్గిన ఉష్ణోగ్రతలు

* ఆదిలాబాద్ జిల్లా భీమ్‌పూర్‌లో 6.3 డిగ్రీలు

* కామారెడ్డి జిల్లానూ వణికిస్తున్న చలి

* మరో రెండు రోజుల పాటు చలిగాలు తీవ్రత

హైదరాబాద్/ఆదిలాబాద్/కామారెడ్డి, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం 13 జిల్లా ల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ తెలంగాణతో పోలిస్తే.. ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. రాష్ట్రంలోనే అతితక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూర్ 6.3డిగ్రీలు నమోదయ్యాయి.

నిర్మల్‌లోని మామ్డాలో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లోని తిర్యానీలో 6.7 డిగ్రీలు, సంగా రెడ్డిలోని కోహీర్‌లో 6.8 డిగ్రీలు, కామారెడ్డిలోని జుక్కల్‌లో 7.6డిగ్రీలు, నిజామా బాద్‌లోని కోటగిరిలో 7.7 డిగ్రీలు, మెదక్‌లోని శివంపేటలో 8.0 డిగ్రీలు, జగిత్యాల లోని మల్లాపూర్‌లో 8.0 డిగ్రీలు, వికారాబాద్‌లోని మోమిన్‌పేట్‌లో 8.2, రాజన్న సిరిసిల్లాలోనిగంభీరావుపేటలో 8.6 డిగ్రీలు, సిద్దిపేటలోని అక్బర్‌పేటలో 8.6డిగ్రీలు, రంగారెడ్డిలోని ఇబ్రహీంపట్నంలో 8.9 డిగ్రీలు, పెద్దపల్లిలోని జూలపల్లిలో 9.5 డిగ్రీలు అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ చెప్పింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజ గజలాడిస్తోంది. జైనథ్ మండలంలో 6.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా బోథ్ మండలం సోనాల, ఆదిలాబాద్, మావల, నేరేడిగొండలలో 6.9కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రంగా ఉన్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు గత మూడు రోజులుగా 10 డిగ్రీలు నమోదు అయ్యాయి. అయ్యాయి. ఆదివారం అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో 7.6, కొటగిరిలో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అయ్యాయి.

నిజామాబాద్ జిల్లా గుపన్‌పల్లిలో 8.3 డిగ్రీలు, పోతంగల్, మెండోరాలో 8.7, కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో 8.9, సాలుర, బిచ్కుంద, బీర్కూర్‌లో 9.2, పాల్దాలో 9.3, నస్రూల్లాబాద్, మాక్లూర్‌లో 9.5,  సిరికొండ, నందిపేట్‌లో 9.6, నిజామాబాద్ సౌత్‌లోని ఎడపల్లి, పాల్వంచ, గాంధారి మండలాల్లో 9.7, చందూర్, పిట్లంలో 9.8,మంచిప్ప, సర్వాపూర్‌లో 9.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.