కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ
26-06-2024 12:05 AM
కొడంగల్, జూన్25 (విజయక్రాంతి) : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని, వారి సమస్యలను ఓపిగ్గా విని న్యాయం చేసే ప్రయత్నం చేయాలని జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కొడంగల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రికార్డులను భద్రపర్చే విధానం, కేసుల నమోదు వంటి వివరాలను తెలుసుకున్నా రు. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల పోలీసు సిబ్బంది మార్యదపూర్వకంగా ఉండాలన్నా రు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.






