20 రోజుల్లో 60 సెల్‌ఫోన్ల రికవరీ
26-06-2024 12:04 AM
బాధితులకు అందజేత
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): సైబరాబాద్ క్రైం డీసీపీ కే నరసింహా పర్యవేక్షణలో ఐటీ సెల్, సోషల్ టీం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్‌ను ఉపయోగించి 20 రోజుల వ్యవధిలో 60 మొబైల్స్‌ను రికవరీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ మంగళవారం పోలీసులు బాధితులకు మొబైల్స్ అందజేశారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు ఐఎమ్‌ఈఐ వివరాలను ఎన్‌సీఆర్‌పీ, సీఈఐఆర్ పోర్టల్స్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే 1930లో ఫిర్యాదు చేయాలన్నారు.






