కట్టంగూర్ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ
29-07-2026 12:00 AM
కట్టంగూరు, జూలై 28 :కట్టంగూర్ పోలీస్ స్టేషన్ను రికార్డులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మంగళవారం తనకి చేశారు., పెండింగ్ కేసులు, సీసీ కెమెరాలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని, రౌడీషీటర్లపై నిఘా పెంచాలని ఆదేశించారు.
నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్ నిబంధనలపై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, ఆన్లైన్ మోసాల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.సిబ్బందితో సమావేశమైన శాంతిభద్రతల పరిరక్షణ, బాధితులకు సత్వర న్యాయం పోలీసు బాధ్యత‘ అన్నారు.






