29 July, 2026 | 12:49 AM

ఈశ్వరమ్మ యాదవ్‌కు అభినందనలు

29-07-2026 12:00 AM

నాగోల్, జూలై 28 (విజయ క్రాంతి): మన్సూరాబాద్ డివిజన్లోని ఆమె నివాసంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా ఎన్నికైన ఈశ్వరమ్మ యాదవ్ను మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యదర్శి ప్రగతి గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కురెళ్ల వేములయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె దేవస్థానం అభివృద్ధి, భక్తుల సేవలో విశిష్ట పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాణి, రవి, నాగేష్ తదితరులు పాల్గొని ఈశ్వరమ్మ యాదవ్కు అభినందనలు తెలియజేశారు.