07-06-2025 08:58:24 PM
పోలీస్ సాలరీ ప్యాకేజీ ఎస్బిఐ బ్యాంక్ అంకౌంట్ ఇన్స్యూరెన్స్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్..
ప్రతి పోలీస్ కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణ కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నందు పని చేస్తూ మరణించడంతో, కుటుంబానికి 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్ ను శనివారం జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్(District SP Narasimha IPS) తన కార్యాలయం నందు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పోలీసులకు ప్రత్యేక సాలరీ ప్యాకేజీ ఇవ్వడం జరిగినది. పోలీసు సిబ్బంది సాధారణ మరణం సంభవిస్తే ఈ పోలీస్ సాలరీ ప్యాకేజ్ అకౌంట్ ద్వారా 10 లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ అందిస్తుంది. ఈ స్కీం ద్వారా ఈరోజు రమేష్ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేయడం జరిగినది అని, ఈ స్కీం పోలీసు కుటుంబాలకు ఎంతగానో ఆర్థిక బాసట నిలుస్తుంది అని ఎస్పి అన్నారు.
ప్రమాదం వల్ల మరణిస్తే సిబ్బంది కుటుంభానికి 1 కోటి రూపాయల ఇన్యురెన్స్ ఈ ప్యాకేజీ నందు కలదు. సిబ్బంది అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి, ప్రమాదాలకు దూరంగా ఉండాలి, ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ స్కీం ను రూపొందించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పి రవిందర్ రెడ్డి, మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్, మహిళా ఎస్సై మౌనిక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూర్యాపేట రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, చీఫ్ మేనేజర్ విద్యాసాగర్, చీఫ్ మేనేజర్ మోహన్ కుమార్, సిబ్బంది ఉన్నారు.