calender_icon.png 12 September, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాట్సాఫ్ అలీమ్

12-09-2025 09:03:59 AM

డ్రైవర్ గా మారిన పోలీసు కు ఎస్పి ప్రశంసల జల్లు 

మహబూబాబాద్ (విజయక్రాంతి): పోలీస్ అంటే ఆపదలో ఉన్నవారికి ముందు వెనక ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించడమే లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని అక్షర సత్యం చేశావు అలీమ్(Constable Alim)  అంటూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్  కానిస్టేబుల్ అలిమ్ ను శాలువాతో సత్కరించి ప్రశంసలతో ముంచేస్తారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల, ఉప్పరపల్లి గ్రామాలకు వరంగల్ నుండి గురువారం యూరియా తీసుకువస్తూ లారీ డ్రైవర్ నడపలేని స్థితిలో ఉండగా, కానిస్టేబుల్ అలిమ్ డ్రైవర్ గా మారి యూరియాను గమ్యస్థానం చేసిన ఘటన నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ కల్వల గ్రామంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అలిమ్ కానిస్టేబుల్ ను చూసి వెంటనే దగ్గరికి పిలిచి శాలువాతో సత్కరించారు. ఎస్పీ వెంట ఎస్సై మురళీధర్ రాజ్ ఉన్నారు. కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో యూరియా పంపిణీ సాఫీగా జరుగుతుండడంతో ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు.