12-09-2025 08:36:30 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): తెల్లారిందో లేదో.. యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ(Mahabubabad District SP) కేకన్ సుధీర్ రామ్నాథ్ శుక్రవారం ఉదయం కార్యరంగంలోకి దిగారు. జిల్లా కేంద్రం నుండి నేరుగా కేసముద్రం చేరుకొని ధనసరి సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన యూరియా వివరాలను, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అక్కడనుండి ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించారు. అక్కడ ఎరువుల పంపిణీకి నిర్వహిస్తున్న చర్యలను పరిశీలించారు. ఎక్కడ కూడా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైతులకు యూరియా పంపిణీ చేయడానికి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.