భిక్కనూర్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ రాజేష్ చంద్ర
28-05-2026 12:00 AM
భిక్కనూర్, మే 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ మంగళవారం భిక్కనూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల కార్యాలయంలో చేపట్టిన మరమ్మత్తులు, ఆధునీకరణ పనులను పరిశీలించిన అనంతరం నూతనంగా పునరుద్ధరించిన సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అభినందించి ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. అనంతరం భిక్కనూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సి ఐ నరేష్,ఎస్త్స్ర ఆంజనేయులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






