26 June, 2026 | 1:26 AM

ఫలితాల్లో బాలికలే టాప్!

26-06-2026 12:26 AM
  1. టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల
  2. 82.61 శాతం మంది ఉత్తీర్ణత మూడు జిల్లాల్లో 100 శాతం ఫలితాలు

హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ల ఫలితాలు విడుదలయ్యాయి. రెగ్యులర్ ఫలితాల మాదిరిగానే ఈ అడ్వానస్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే మరోసారి తమ ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఈ ఏడాది పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 31,736 మంది విద్యా ర్థులు నమోదు చేసుకోగా.. వారిలో 27, 857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరి లో రికార్డు స్థాయిలో 23,013 (82.61 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

బాలురు 17,568 మందికి గానూ 14,281 (81.29) శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 10,289 మందికిగానూ 8,732 (84.87) శాతం మంది పాసయ్యారు. ఈనె ల 5నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మూడు జిల్లా లు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట్, ములుగు జిల్లాలు ఉన్నాయి. 44.43 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. గురువారం ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖకార్యాలయంలో ఉన్నతాధికారులు విడుదల చేశారు.