6 April, 2026 | 3:46 AM

యాదవుల పట్ల ప్రభుత్వాల చిన్నచూపు

06-04-2026 01:46 AM

నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని వక్తల డిమాండ్

ఖమ్మం జిల్లా యాదవ కురుమ ప్రజా ప్రతినిధుల సన్మాన సభలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మల్లి బాబు యాదవ్

ఖమ్మం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాదవులపై చిన్నచూపు చూస్తున్నాయని, యాదవుల జనాభా 18% ఉన్నప్పటికీ జనాభాకు తగ్గట్లుగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని, అందుకే రాజకీయాలు వర్గాలకతీతంగా ప్రతి యాదవుడు సంఘటత శక్తిగా ఉంటే రాబోయే రోజులలో యాదవులకే రాజ్యాధికారం సిద్ధిస్తుందని సన్మాన గ్రహీత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పేర్కొన్నారు.

ఆదివారం నాడు ఖమ్మం రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు సర్పంచులు ఉప సర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లకు అఖిలభారత యాదవ మహాసభ మరియు జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాలలో కులవృత్తి, వ్యవసాయంతోపాటు విద్యకు ప్రాధాన్యత నివ్వాలని, చదువుకున్న వాళ్ళకే రాజకీయ పరిజ్ఞానం ఉంటుందని, విద్యాపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థిక సహాయం చేస్తానని, అన్ని వర్గాల రాజకీయాలు అయిపోయాయని, రాబోయే తరం రాబోయే రాజకీయ భవిష్యత్తు యాదవులయిదేననిఏ అవకాశం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఐక్యంగా ఉండే సాదించాలని పిలుపునిచ్చారు.

వక్తలు మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్, యువజనజిల్లా అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్, టిపిసిసి నెంబర్ పుచ్చకాయల వీరభద్రం, గంగదేవుల లోకేష్ యాదవ్, వాగదాని పుల్లారావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా  యాదవులకు  రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్ర కౌన్సిలర్లు లోడిగ వెంకన్న, దుబాకుల వెంకటేశ్వర్లు, చంద్రకాని రమణ తెల్లబోయిన వెంకటరమణ, మేకల మల్లిఖార్జున రావు,దుబాకుల శ్రీనివాస్, చేతుల నాగేశ్వరావు, మొరిమేకల కోటయ్య పాల్గొన్నారు.