కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి దుర్మార్గం
నూతనకల్, ఏప్రిల్ 5: ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ దాడి ఘటన రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనమని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ కార్యాలయంపై దాడి చేయడం అంటే తెలంగాణ ప్రజల గౌరవంపై దాడి చేసినట్టేనని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను ప్రజలు ఎన్నటికీ సహించరని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, సర్పంచులు కాస నరేందర్ యాదవ్, మహేశ్వరం మల్లికార్జున్, గార్డుల లింగరాజు యాదవ్, గుగులోతు కోటేష్, జటంగి సరితా కృష్ణ, మాదాసు వెంకన్న, మాజీ సర్పంచ్ చూడ లింగారెడ్డి, నాయకులు బత్తుల విద్యాసాగర్, బత్తుల విజయ్, ఉప్పుల వీరు యాదవ్, మొగుళ్ల వెంకన్న, వల్లమల్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.




