calender_icon.png 3 February, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,454 కోట్లు

03-02-2026 01:02:31 AM

రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్

సికింద్రాబాద్, ఫిబ్రవరి2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు గంటకు 350కి.మీ స్పీడ్ పరుగులుపెడతాయని కేం ద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో తెలంగా ణకు రూ.5,454 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి వర్చువల్‌గా వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి చెన్నై, పూణె, బెంగళూరుకు 3 హైస్పీడ్ రైళ్లు రానున్నాయి.

దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లొచ్చు. పుణెకు 1.55 గంటల్లో, చెన్నైకు 2.55 గంటల్లో చేరుకోవచ్చు. హై స్పీడ్ కారిడార్లు లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు మధ్య ఆర్థిక,హెల్త్, టూరిజం అభివృ ద్ధి చెందుతుంది.తెలుగు రాష్ట్రాల కు ఒక గేమ్ చేంజర్‌గా మారతాయి అని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. అనంతరం రైల్వే జీఎం మాట్లాడుతూ రైల్వే బడ్జెట్ ఆశాజనకంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ వాత్సవ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఆర్‌ఓ శ్రీధర్, రైల్వే ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.