calender_icon.png 18 September, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

18-09-2025 07:08:13 PM

డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకాష్.. 

కుభీర్: మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఆకాష్(Deputy DMHO Dr. Akash) సూచించారు. గురువారం అయన మండల కేంద్రం కుబీర్ లోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకంపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పథకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పథక ప్రధాన ఉద్దేశం మహిళల ఆరోగ్యంలో భాగంగా రక్తహీనత తల్లి శిశు సంరక్షణ, మంచి పోషకాహారం, పరిశుభ్రత జీవన శైలిపై ప్రత్యేక అవగాహన, మానసిక ఆరోగ్యానికి కౌన్సిలింగ్ తో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు. అనంతరం సంబంధించిన రికార్డులను, హాస్పిటల్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ హర్షి, వైద్యులు విజయ్, వసుంధర, ఫార్మసిస్ట్ సల్ల ఆనంద్, రాధిక, ఏఎన్ఎమ్ లు, హెల్త్ సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.