calender_icon.png 18 September, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే

18-09-2025 07:06:17 PM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి..

నకిరేకల్ (విజయక్రాంతి): భూమి, భుక్తి, విముక్తి కోసం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమే అని దీనిని మత ఘర్షణగా సృష్టించే బిజెపి విధానాన్ని ఎండగట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల జిల్లా వ్యాప్త యాత్ర సందర్భంగా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో జరిగిన ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ తెలంగాణ విమోచన పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ హిందూ ముస్లింల గొడవగా సృష్టిస్తూ తప్పుదారి పట్టిస్తూ చరిత్రను వక్రీకరిస్తుందని విమర్శించారు. పటేల్ సైన్యాలు తెలంగాణలో గ్రామాలలో విముక్తి చేశాయని చెబుతున్న బిజెపి నాయకులు సాయుధ పోరాటంలో 4వేల మంది ప్రాణాలర్పించి, 3000 గ్రామాలను విముక్తి చేసి, 10 లక్షల ఎకరాల భూమిని పంచిన కమ్యూనిస్టుల పోరాటాన్ని ఎందుకు చెప్పడం లేదని అన్నారు.

రజాకార్ సైన్యాల చేతిలో 1500 మంది చనిపోతే, పటేల్ సైన్యాల చేతిలో 2500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు మరణించారని అన్నారు. విష్ణు రామచంద్రారెడ్డి లాంటి దొరలు భూస్వాములు జాగీర్దారులు నిజాం ప్రభువుకు పెద్ద బంట్లుగా వ్యవహరించే వారని అన్నారు. అరాచక నిజం రాజుని శిక్షించకుండా రాజ్ ప్రముక్ గా గౌరవించి 1951 సంవత్సరం వరకు పదవిలో కొనసాగించారని అన్నారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, స్వరాజ్యం, షాయబుళ్లాఖాన్, బందగీ వంటి యోధులంతా కమ్యూనిస్టులే అని అన్నారు. వారి జీవిత చరిత్రలే తెలంగాణా పోరాటానికి నెత్తుతి సాక్ష్యాలని అన్నారు. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే బీజేపీ ని చరిత్ర క్షమించదని అన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్ మాట్లాడుతూ వీరోచిత తెలంగాణా సాయుధ పోరాట స్ఫూర్తితో పాలకులు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా ఉద్యమించాలని అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేస్తున్నాయాన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు అద్వానంగా ఉన్నాయి కనీసం తాత్కాలిక మరమ్మత్తులు కూడా చేసే పరిస్థితి లేక పోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత రెండు సంవత్సరాల నుండి పంచాయతి ఎన్నికలు జరపక పోవడంతో పారిశుధ్యం, గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభ అనంతరంప్రజానాట్యమండలి కళాకారుల ఆట-పాట ప్రజలను ఆకట్టుకున్నాయి. రాళ్లపల్లి జితేందర్ అధ్యక్షతన జరిగిన  ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరినాగేష్, జంపాల అండాలు, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు తొలుపునూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మేకల కృష్ణయ్య, ప్రజానాట్యమండల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, గ్రామ శాఖ నాయకులు జోగుల శ్రీనివాస్, తొలుపునూరి చంద్రశేఖర్, నోముల రమేష్, బూడిద బిక్షం, జంపాల ఉమాపతి, మేడి భాషయ్య, జోగులధనలక్ష్మి, పులిపలుపుల నాగార్జున, ఉండ్రాతి నర్సింహా,గునుగుంట్ల సత్యనారాయణ,అప్పం సురేందర్, శిరీష, యాదగిరి, యాదాసు శారద, హేమలత,బత్తిని సందీప్ తదితరులు పాల్గొన్నారు.