టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
లేకుంటే కామారెడ్డి నుంచి వెయ్యి మందితో గాంధీ భవన్‌లో దీక్ష చేపడతాం
కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల డిమాండ్
కామారెడ్డి, జూన్ 5 (విజయక్రాంతి): టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డినీ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్లు మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ ఓటమికి చంద్రశేఖర్ రెడ్డి కారణమని అన్నారు.
చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే కామారెడ్డి నుండి 1000 మందితో గాంధీభవన్లో దీక్ష చేపడతామన్నారు. అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని అన్నారు. నలుపై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న తమకు నిన్న గాక మొన్న వచ్చి కాంగ్రెస్ ను విచ్చిన్నం చేసేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవుల్లో కొనసాగిన వారు డబ్బులకు అమ్ముడుపోయారన్నారు.
గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతూ టిఆర్‌ఎస్ కోర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ నాలుగు కోట్లకు షబ్బీర్ అలీ అమ్ముకున్నట్లు తప్పుడు ఆరోపణ చేయడం తగదన్నారు. ఏ ఒక్కటి రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని షబ్బీర్ అలీ వర్గా కాంగ్రెస్ నాయకులన్నారు. చంద్రశేఖర్ రెడ్డిపై తాము చేసిన ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
వారం రోజుల్లో చంద్రశేఖర్ ఎన్ని సస్పెండ్ చేయకపోతే సీఎం, పిసిసి చీప్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లను 1000 మందితో వెళ్లి కలుస్తామన్నారు. అప్పటికి సస్పెండ్ చేయకపోతే తామే రాజీనామాలు చేస్తామని వారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందీప్ కుమార్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా గౌడ్, నౌశిలాల్, గోనె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, భీమ్ రెడ్డి పాల్గొన్నారు.






