25 March, 2026 | 4:48 PM

విధుల కేటాయింపులు సీనియార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి

25-03-2026 03:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): త్వరలో జరగనున్న మొదటి దశ జనగణన (సెన్సెస్)లో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ సర్వేలో ఉపాధ్యాయులకు విధుల కేటాయింపులో సీనియారిటీ పాటించాలని సోన్ మండల తహసిల్దార్ కే.మల్లేష్ రెడ్డికి వినతిపత్రం అందించారు. సెన్సెస్ విధుల కేటాయింపు మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయిస్తూ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తోడిశెట్టి రవికాంత్, రాపర్తి అశోక్ కుమార్, భూమారెడ్డి, కుంట సాయికుమార్, నర్సయ్య, చల్లా గోవర్ధన్, రవీందర్ గౌడ్, కుర్మే నాగయ్య, శ్రీధర్, బాపు, విద్యాసాగర్ పాల్గొన్నారు.