29 July, 2026 | 1:16 AM

ఇస్తేమాలో ప్రత్యేక దువా

29-07-2026 12:00 AM

పాల్గొన్న మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత, శ్రీనివాస్ గౌడ్

మహేశ్వరం,జూలై 28(విజయక్రాంతి) : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జలపల్లి సర్కిల్, షాహీన్ నగర్ మర్కజ్లో నిర్వహించిన ఇస్తేమా (ధార్మిక సభ) అత్యం త వైభవంగా జరిగింది. ఈ మహాసభలో మాజీ మంత్రులు హరీష్ రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు ముస్లిం మత పెద్దలను కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు విలసిల్లాలని దువా చేశారు.