మానసిక సమస్యతో బాధపడుతున్న మహిళ అదృశ్యం
నాగోలు, జూలై 28 (విజయ క్రాంతి): నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ అదృశ్యమైంది. బండ్లగూడకు చెందిన కె.లక్ష్మి (39) మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త నారాయణ నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కె. లక్ష్మి కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
అదృశ్యమైన సమయంలో ఆమె ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉన్నారని, ఎత్తు సుమారు 5 అడుగులు, గోధుమ వర్ణం, సన్నని శరీరాకృతి, గుండ్రటి ముఖం, నల్లటి జుట్టు కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నాగోలు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కె. లక్ష్మి ఆచూకీ తెలిసిన వారు నాగోలు పోలీస్ స్టేషన్ను లేదా 9676175912 నంబర్ను సంప్రదించాలని నాగోలు ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ విజ్ఞప్తి చేశారు.






