calender_icon.png 13 September, 2024 | 12:01 AM

ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

10-07-2024 05:45:07 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల, జూలై 9 (విజయక్రాం తి): కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుం ట ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం వేములవాడ, చందుర్తి మండలాల్లో ఆయన పర్యటించారు. వేములవాడ లో మున్నూరుకాపు కల్యాణ మండపానికి శంకుస్థాపనచేశారు. కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. బండి మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధిపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశానని, అవసరమైతే ఆయనను వేములవాడకు తీసుకొస్తానని చెప్పారు. తన గెలుపునకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు సహకరించారని చెప్పారు. తనకు భారీ మెజార్టీ అందించిన వేములవాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  

ఏబీవీపీతో దేశ పునర్నిర్మాణం

కరీంనగర్, జూలై 9 (విజయక్రాంతి): విద్యారంగ సమస్యలతోపాటు దేశభక్తిని పెంపొంది స్తూ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైన ఏకైక విద్యాసంస్థ ఏబీవీపీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.  ఏబీవీపీ ఏర్పా టై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంఘం నాయలకు శుభాకాంక్షలు తెలిపారు.