మాదక ద్రవ్యాలపై స్పెషల్ ఫోకస్
నాలుగు నెలలుగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు
రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియం త్రణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు, నాలుగు నెలలుగా దాడులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్య ంలో రాష్ట్ర ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు నెలలుగా ప్రత్యేకదాడులు నిర్వహిస్తూ భారీగా గంజాయి, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వా టిని తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపామని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుద ల చేశారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం స్వాధీనం
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని నిల్వ చేసిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, మత్తు పదార్థాలు, మద్యం దిగుమతి చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో మార్చి 10న రూ. 7లక్షల విలువ చేసే నాన్‌డ్యూటీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం లో ఓ పాత గోదాంలో 90కాటన్ల మద్యాన్ని పట్టుకున్నారు. శంషాబాద్‌లో రెండు రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ నిర్వహించిన దాడిలో రూ. 1.73కోట్ల విలువ చేసే నల్లమందు తయారీకి ఉపయోగించే సామగ్రిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమందు మస్క్ పౌడర్‌తో తయారు చేసే మిరాజ్, విమల్ గుట్కాల తయారీకి ఉపయోగించే మూలికలు, నల్లమందును బాబు ల్‌రెడ్డినగర్ బస్తీలో స్వాధీనపర్చుకున్నారు. ఈ మత్తు పదార్థాలను రాజస్థాన్, హర్యానా నుంచి నిందితులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నగరంలోని పలువురు వీటిని వినియోగిస్తున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు గుట్టు చప్పుడు కాకుండా గంజా యిని తరలిస్తున్న ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని దూల్‌పేట్‌లో ఓ కారులో తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో దాడులు నిర్వ హించి రూ. పది లక్షల విలువైన 70కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు, రెండు బైక్‌లు, 70 కేజీల గంజాయిని పట్టుకుని, నలుగురిని అరెస్ట్ చేశారు. మల్కాజిగిరిలో ఏప్రిల్‌లో గుట్టు చప్పుడు కాకుం డా డిఫెన్స్ మద్యాన్ని అమ్ముతున్న వారి నుంచి 25 మద్యం బాటిళ్లను అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
8.27కోట్ల విలువగల నాటుసారా, రూ. 47.83కోట్ల మత్తుపదార్థాలు స్వాధీనం
నాలుగు నెలలలో ఎక్సైజ్ పోలీసులు నాటుసారా తయారీదారులపై 9,145 కేసులు నమోదు చేశారు. 8.27కోట్ల విలువ గల నాటుసారా, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 4,010మందిని నిందితులుగా చేర్చారు. 47,640 లీటర్ల గుడుంబ, 2.48లక్షల కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు. 14,302 కేజీల ఆలమ్, 593వాహనాలను సీజ్ చేశా రు. అక్రమంగా మద్యాన్ని అమ్మిన, నిల్వచేసిన 302మందిపై 165 కేసులు నమోదు చేశారు. 35 వాహనాలను సీజ్ చేశారు. 3740 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ. 61.13లక్షల విలువ గల మద్యా న్ని సీజ్ చేశారు. కల్తీకల్లు తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 565. 6 కేజీల క్లోరల్ హైడ్రేట్‌ను సీజ్ చేశారు. 7,41,281 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేశారు. 5.46కేజీల అల్ఫోజోలమ్, 1.52కేజీల డైజోఫామ్‌ను పట్టుకున్నారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే రూ. 47.83 కోట్ల విలువ గల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.






