16 April, 2026 | 3:28 PM

ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు

16-04-2026 01:48 PM

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు అని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 32వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ భాగంగా వార్డ్ సభలో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం హామీలు.

ఉచిత బస్, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ , వంటి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందిస్తుంది అని తెలిపారు. కార్యాచరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి కి సహకరించలి అని   కోరారు అనంతరం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్  కమిషనర్ రాజన్న , డి ఎం సి లక్ష్మీ, కార్పొరేటర్ వెన్నెల రఘు, శ్రావణ్ కుమార్ , రాఘవేంద్రర్, మైత్రి యాదయ్య , నక్క శ్రీను వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాలు,వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.