1 April, 2026 | 2:31 AM

ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులపై ప్రత్యేక దృష్టి

01-04-2026 12:00 AM

* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్

హనుమకొండ, మార్చి 31 (విజయ క్రాంతి): ఎన్ ఫోర్స్మెంట్ విధులపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచిం చారు. మంగళవారం వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమ ఇసుక రవాణా గుట్కా విక్రయాలు , పేకాట, బెట్టిం గ్ లను ఎన్ ఫోర్స్మెంట్ తో కట్టడి చేయాలని అన్నారు. గంజాయిను విక్రయించే పాల్పడే మూలలపై దృష్టి సారించాలని అన్నారు.

వకమిషనరేట్ పరిధిలో పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని,చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు, కృషి చేయాలని, స్టేషన్ అధికారు లు తమ పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్కు అనుసంధానం చేయాలనని అన్నారు.

గంజాయి వినియోగదారున్ని పట్టుకోవడంతో మన బాధ్యత అయిపోతుందని అనుకొంకుండా గంజాయిని వియ్రించే వారి గుర్తించి అరెస్టు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయా లని, రోడ్డు ప్రమాదాల నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఆరైవ్ - ఆలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వినూత్న రీతిలో అవగహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

రాబోవు హనుమాన్ జయంతి వే డుకలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారు లు ముందస్తూ ప్రణాళికలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, జనగామ ఏ.ఎస్పీ చేత న్, ట్రైనీ ఐపిఎస్ మనీషా నెహ్ర, అదనపు డిసిపిలు ప్రభాకర్ , రవి,బాలస్వామి,శ్రీనివాస్ తో పాటు ఏసిపిలు, ఇన్స్సె్పక్టర్లు, అర్. ఐలు ఎస్.ఐలు పాల్గోన్నారు.