9 July, 2026 | 10:32 AM

ఆదివాసీగూడలో సాంప్రదాయంగా ఉగాది

20-03-2026 12:00 AM

వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన ఆదివాసీలు

ఉట్నూర్, మార్చి 19 (విజయక్రాంతి): ఆదివాసి గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు జరుపుకుంటారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివాసులు తమ సాంప్ర దాయ రీతిలో ఉదయం ఇంటింటి నుంచి నవధాన్యాలను సేకరించి, గ్రామ పటేల్ ఇంటి వద్ద గుడాలను సిద్ధం చేశారు. ప్రతి ఇంటి నుండి వ్యవసాయ పనులకు  అరకలు పట్టుకొని పొలాలకు వెళ్లి పూజలతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. వ్యవసా య భూమిలో భూదేవికి నైవేద్యంగా జొన్న గటక, జొన్న రొట్టె  తో పాటు ఇంటి వద్ద సిద్ధం చేసిన కారంను  నైవేద్యంగా సమర్పించారు.

అనంతరం వ్యవసాయ పనులను ప్రారంభించారు. వ్యవసాయ చేనులో నుం డి తిరిగి వచ్చిన ఆదివాసులు  గ్రామ పటేల్ ఇంటి వద్ద సాంప్రదాయంగా సిద్ధం చేసిన నవధాన్యల గూడాలను (గుగ్గిళ్ళు) దేవతలకు నైవేద్యంగా సమర్పించి, ఎడ్ల కు తినిపించారు. సహా పంక్తిగా గుడాలను  ఆరగించారు. ఉట్నూర్ మండలంలోని  కల్లూరు గూడలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఆదివాసులతో కలిసి గుడాలను స్వీకరించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసి గిరిజనులు తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకా రంగా ఉగాది పండుగను జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న ఆచారం అని అన్నా రు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉగాది పండుగను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు  సాంప్రదాయానికి లోటు రాకుండా పండగ జరుపుకోవడం హర్షనీయమని అన్నారు.