గిరిజనుల హక్కులు, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
ఆసిఫాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): గిరిజనులకు వంద శాతం ఉపాధి, విద్యావకాశాలు కల్పించడంతో పాటు వృద్ధులు, వికలాంగులు, అనాథ శిశువుల కోసం ఆసిఫాబాద్ ప్రాంతంలో ప్రత్యేక ఆశ్రమాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రాథమిక సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించాలని కోరారు. గిరిజన యువతకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలతో పాటు విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జీవో నెంబర్ 109 ప్రకారం పోలీసు ఉద్యోగాల్లో ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్ర భుత్వాన్ని కోరారు.
అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, అనాథ శిశువులకు మెరుగైన సంరక్షణ, వసతులు కల్పించేందుకు ఆసిఫాబాద్ ప్రాంతంలో ప్రత్యేక ఆశ్రమాలను నిర్మించి ప్రభుత్వమే నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు.






