8 April, 2026 | 2:19 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

08-04-2026 12:08 AM

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్  

ఎన్ హెచ్‌ఏ అధికారులతో సమీక్ష సమావేశం

మునిపల్లి  ఏప్రిల్ 7: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మునిపల్లి టోల్ ప్లాజా వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం జాతీయ రహదారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై సమగ్రంగా చర్చించారు. ప్రమాదాలకు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు (సైన్ బోర్డులు), స్పీడ్ లిమిట్ సూచనలు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా  ఎస్పీ మాట్లాడుతూ  రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలు ఉన్నట్లయితే మరమత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మేనేజర్ శివ ప్రకాష్, ఇండిపెండెంట్ ఇంజనీర్ సంజోగ్ డోంగ్రే, దక్కని టోల్ల్వేస్ ప్రైవేట్ లిమిటెట్ ప్రాజెక్ట్ హెడ్ ప్రవీణ్ దూబే, ఐఐటి రోడ్డు ఇంజనీరింగ్ ఎక్సపర్ట్ దిగ్విజయ్, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, ఇన్స్పెక్టవర్స్ వెంకటేశ్, రామకృష్ణ రెడ్డి, శివలింగం, సుమన్ కుమార్, ఎస్పీ లు రాజేష్ నాయక్, వినయ్, కాశినాథ్, రాజేందర్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు.