13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

30-03-2026 09:21 PM

హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ మాలిక ఆధ్వర్యంలో వడ్డేపల్లి హోమియో డిస్పెన్సరీ (చమాన్) ఆవరణంలో నిర్వహిస్తున్న, ప్రత్యేక వైద్య శిబిరమును హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా వైద్యాధికారులు, సిబ్బంది సేవలు రెగ్యులర్గ అందిస్తున్నప్పటికీ, ఆరుగురు స్పెషలిస్ట్ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, చిల్డ్రన్, డెంటిస్ట్, సేవలందిస్తున్నారని, అందువలన ఈ శిబిరం ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

మెరుగైన సేవల నిమిత్తం డాక్టర్లు రిఫర్ చేసిన వారి వివరములు, తమ వద్ద విడివిడిగా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ముందుగా ఉచిత వైద్య సేవలో పాల్గొన్న ప్రజలకు ఆరోగ్య శాఖ ద్వారా చేపడుతున్నటువంటి ఆరోగ్య కార్యక్రమాలు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. శిబిరంలో 264 మందికి పరీక్షలు నిర్వహించారు. 11 మందికి టాప్ స్మైరూ టెస్టులు, 35 మందికి ల్యాబ్ టెస్టులు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు.