యాదగిరిగుట్ట మున్సిపల్ సమావేశం.. బడ్జెట్ పై సమీక్ష
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 2026-27 సంవత్సరం ఆర్థిక బడ్జెట్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమక్షంలో ఏర్పాటు చేసిన బడ్జెట్‌ను సోమవారం చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్‌గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపల్ బడ్జెట్ రూ.25.73 కోట్లు, జనరల్ ఫండ్ ఆదాయం రూ.6.83 కోట్లు, ఖర్చు రూ.6.60 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్ల ఆదాయం రూ.18.90 కోట్లు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ రూ.25.73 కోట్లుగా ప్రకటించారు.
మున్సిపల్ జనరల్ ఫండ్ ఆదాయం రూ.6.83 కోట్లు కాగా అందులో 4.42 కోట్లు, ఇతర ఖర్చుల పేరుతో 2.18 కోట్లు కేటాయించగా అందులో 1.70 కోట్లు జీతాలను కేటాయించారు. ఈ సమావేశంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ఏకగ్రీవంగా బడ్జెట్ తీర్మానం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. సంవత్సర జనరల్ ఫండ్ రూ.6.83 కోట్లుగా నిర్ధారించగా, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా ఆదాయం రూ.18.90 కోట్లుగా, మొత్తంగా 25.73 కోట్లుగా ఆర్థిక బడ్జెట్ ప్రకటించారు.
జనరల్ ఫండ్ బడ్జెట్‌లో భాగంగా సీసీ చార్జెస్ 1.20 కోట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు 1.16 కోట్లు, గ్రీన్ బడ్జెట్‌కు 0.57 కోట్లు, వాటర్ సప్లై నిర్వహణకు 0.46 కోట్లు, పరిపాలన ఖర్చుకు 0.52 కోట్లు, ప్రజా సౌకర్యాలకు 0.23 కోట్లు, వార్డుల వారీగా అభివృద్ధి ఖర్చు 0.28 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బరిగె రమ్య, కౌన్సిలర్స్ బోడ రాధ, బూడిద మధు, కాటబత్తిని స్వప్న, బిట్టు సరోజ, కర్రె మాధవి, పెలిమెల్లి లావణ్య, పేరబోయిన సత్యనారాయణ, సాదునేని ధనలక్ష్మి, ముక్కేర్ల మల్లేష్, బబ్బూరి శ్రీధర్, కార్యాలయ మేనేజర్ యు.శారద, శానిటరీ ఇన్స్‌పెక్టర్ పి.సురేందర్, సీనియర్ అసిస్టెంట్ యల్.రవీందర్, జూనియర్ అకౌంటెంట్ కె.రజినితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




