23 June, 2026 | 5:31 PM

Breaking News

ఖరీఫ్ సాగుకు విత్తన మేళా..   •   గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం   •   ప్రీవెడ్డింగ్ షూట్‌లో ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపిన యువతి   •   రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •  

సాయి మందిరంలో ప్రత్యేక పూజలు అన్నదానం

11-12-2025 05:10 PM

ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు

కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామం సాయి మందిరంలో ఈదర నరసింహారావు చిట్టెమ్మ దంపతుల చిన్న కుమారుడు ఈదర రవిచంద్ర(లేటు) వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి గురువారం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పూజల అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిపి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్ర నరసింహారావు, ఈదర వెంకటేశ్వర్లు, ముండ్ర వెంకయ్య, సుబ్బారావు,  వినయ్ కుమార్, అజయ్‌, అర్చకులు సాయి శర్మ,తో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.