calender_icon.png 23 February, 2026 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థుల కోసం బాప్టిస్ట్ చర్చిలోప్రత్యేక ప్రార్థనలు

23-02-2026 12:43:25 AM

ఉన్నత ఫలితాల కోసం ఆశీర్వాదం& పరీక్షా ప్యాడ్ల పంపిణీ

కోదాడ ఫిబ్రవరి 22:ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విజయాల కోసం  కోదాడ  పట్టణంలోని నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు.ఆదివారం పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరీక్షలు రాయబోయేవిద్యార్థినివిద్యార్థులను ప్రత్యేకంగా ఆశీర్వదించి, వారి భవిష్యత్తు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ, పరీక్షలు అనేవి జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మెట్టు. విద్యార్థులు ధైర్యంగా, నిబద్ధతతో పరీక్షలు రాస్తే ఉన్నత ఫలితాలు సాధించగలరు అని సూచించారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి, భవిష్యత్తులో గొప్ప ప్రయోజకారులుగా ఎదగాలని దేవుని ఆశీర్వాదం కోరుతూ ప్రత్యేక ప్రార్థన చేశారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రోత్సాహంగా పరీక్షా ప్యాడులను బహుమతిగా అందజేశారు. ఈ చిన్న కానుక విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నింపింది. తల్లిదండ్రులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణుడు, కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి వంట జానకి, ఏసయ్య, బుల్లి కొండ కోటయ్య, జగ్గు నాయక్, నడిగూడెం మండల మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు జ్యోతి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.