విద్యార్థి దశ నుండే సామాజిక స్పృహ ఉండాలి
23-02-2026 12:43 AM
నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): బాల్యం నుండే పిల్లలకు సామాజిక బాధ్యత, స్పృహ, సామాజిక చైతన్యం అలవర్చుకోవాలని వట్టేం జవహర్ నవోదయ విద్యాలయ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ శ్రీ జీ. జానకి రాములు సూచించారు. సామాజిక సమస్యల పట్ల విద్యార్థులకు అవగాహన ఉండాలని, తన అభివృద్ధితో పాటు, ఆపదలో ఉన్న వారిని ఆదుకొనే అలవా టు చిన్నతనం నుండే రావాలని వి.భాస్కరాచారి అన్నారు.
ఆదివారం వట్టెం నవోదయ విద్యాలయం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లోని జ్ఞానేశ్వర వాత్సల్య మందిర అనాథ బాలికల ఆశ్ర మం, జ్ఞాన సరస్వతి ఆలయ ఆవరణలోని అనాథ బాలుర ఆశ్రమంలలో బాల బాలికలకు దుప్పట్లు, స్టేషనరీ పంపిణీ చేశారు. నవోదయ విద్యార్థులలో సామాజిక స్పృహ కల్పించి సమా జ సేవలో బాధ్యులను చేయడం కొరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.






