calender_icon.png 23 February, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం

23-02-2026 12:42:29 AM

చిన్నచింతకుంట, ఫిబ్రవరి 22:  మండల కేంద్రంలోని దమ్మగ్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన కొత్త గృహాలకు లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి   గృహప్రవేశ  కార్యక్రమాలలో పాల్గొని  లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి అర్హుడికీ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే సహకారంతోనే మాకు మేలు జరిగిందని ఎమ్మెల్యేకు ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.