శ్రీ వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు
వైభవంగా అమ్మవారి పల్లకి సేవ
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి (వాసవి మాత దేవాలయం)లో అధిక జేష్ట మాసం పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి ఓడి బియ్యం సారే సమర్పించారు, పలు రకాలకు చెందిన 33 నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు, ఆలయ అర్చకులు వల్లకొండ మఠం మహేష్ , పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు బాదం వాణి అధికమాస ప్రత్యేకతను వివరించారు, అనంతరం వాసవి మాత పల్లకి సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు, ప్రముఖ రైస్ మిల్ వ్యాపారవేత్త నార్ల వెంకన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు, పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు బాదం వాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కొమురవెల్లి రామ్మూర్తి, అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, ప్రధాన కార్యదర్శి తోడుపునూరి రాజేంద్రప్రసాద్ , క్యాషియర్ కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్, శ్రీ శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ , వాసవి క్లబ్ అధ్యక్షులు రామిడి రవీందర్, సామాజిక సేవకులు పల్లకిషన్ పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు...






