పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ
13-06-2026 12:25 PM
వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మండలం బంబార గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దోమల నివారణ మందును పిచికారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి హెచ్‌ఈఓ రవిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో ఏసీఎం (5%) మందును పిచికారీ చేసి దోమల వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ బెండారే కృష్ణాజీ హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఈఓ రవిదాస్ మాట్లాడుతూ... డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ఈ చర్యలు ఉపయోగ పడతాయని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం సునంద, ఆశ వర్కర్ లక్ష్మీతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.






