13 June, 2026 | 2:26 PM

Breaking News

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •  

తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR

13-06-2026 01:23 PM

ఉమ్మడి పాలనలో తెలంగాణ అంటే నాయకులకు గౌరవం ఉండేది కాదు

వేములవాడ: ఉమ్మడి పాలనలో తెలంగాణ అంటే నాయకులకు గౌరవం ఉండేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR) స్పష్టం చేశారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ను టీడీపీలోకి తీసుకుంటే బాగుంటుందని భాగ్యరెడ్డి చెప్పారని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పేర్కొన్నారు. రెండే ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా నిలబడ్డాయని సూచించారు. టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే మిగిలాయని కేటీఆర్ వివరించారు. కష్టపడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు.

కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో  రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక్కనాడైనా పాల్గొన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. వానపాములు కూడా నాగుపాములై బుస కొడుతున్నాయని తెలిపారు. తెలంగాణ తానే సాధించినట్లు రేవంత్ మాట్లాడుతున్నారని చురకలంటించారు. ఎవని పాలయ్యింది తెలంగాణ అని పాట(Yevani Palayindi Ro Telangana Song ) పాడుకునే దుస్థతి వచ్చిందన్నారు. కేసీఆర్ పాలన బాగుండేందని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ జోస్యం చెప్పారు. అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో దాశాబ్దపు అబద్ధం అన్నారు. తెలంగాణలో జూన్ 25 నుండి SIRను తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు. ఎస్ఐఆర్ జరిగిన ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్లకు పడవన్న ఓట్లు అన్ని తొలగించారని కేటీఆర్ ఆరోపించారు.