calender_icon.png 30 October, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందూరులోని శంభుని గుడిలో ప్రత్యేక పూజ,అభిషేకం

28-10-2025 12:00:00 AM

పరమేశ్వరుని సేవలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి):  పవిత్రమైన కార్తీక సోమవారంసందర్భంగా ఇందూరు నగరంలోని ప్రాచీన శివాలయమైన శంభుని గుడిలో ప్రత్యేక పూజా, అభిషేక కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ పాల్గొన్నార. ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం మన ఆధ్యాత్మికత, సేవ, సత్సంకల్పాల ప్రతీక. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, దీపారాధన మన మనసును శాంతింపజేసి సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తుందన్నారు. శంభుని గుడి మన ఇందూరుకు ఆధ్యాత్మిక కేంద్రంఅని.

ఈ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, పరిసరాల అభివృద్ధి కోసం తన సహకారం ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో అందిస్తానన్నారు. ఎమ్మెల్యే  ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి ద్వారా మన యువతలో సానుకూల ఆలోచనలు పెంపొందుతాయి. ప్రజల సహకారంతో మనం ఇందూరును ఆధ్యాత్మికంగా, సామాజికంగా అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలి, ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.  ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.