calender_icon.png 30 October, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య కాపురానికి రాలేదని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

28-10-2025 12:00:00 AM

కామారెడ్డి అక్టోబర్ 27(విజయ క్రాంతి) : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ఒంటిపై ట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి (37) ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. 

జీవన్‌రెడ్డికి ముస్తాబాద్ మండలం మొరాయిపల్లి గ్రామానికి చెందిన చందన తో వివాహం జరిగింది. వీరికి మోక్ష, కృతిక ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత రెండు మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాది కిత్రం చందన తన పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల నోటీసులు రావడంతో..అప్పటినుంచి ఎన్నిసార్లు అడిగినా కాపురానికి రాలేదు.

ఇటీవల విడాకుల నోటీసులు కూడా రావడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం 7:30 సమయంలో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి మండలం గర్గుల్ శివారులోని అడ్లూర్ గోదాం వద్ద ఉన్న రాధస్వామి సత్సంగ్ ఆశ్రమం వెనకాల మృతదేహా మై కనిపించడంతో గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు.

దాంతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి రూరల్ సీఐ రామన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.