calender_icon.png 20 November, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీకమాస బహుళ అమావాస్య సందర్భంగా శ్రీ బగలాముఖి శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు.!

20-11-2025 08:38:41 PM

ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్.!!

శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలో నిర్మితమైన శ్రీ భగలాముఖి శక్తిపీఠం భారతదేశ నలుమూలల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి శ్రీ భగలాముఖి శక్తి పీఠం అమ్మవారి యొక్కవిశిష్టలు తెలుసుకొని అనేకమంది భక్తులు ప్రతినిత్యం ప్రజలు భారీ సంఖ్యలో ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకోవడం కోసం రావడం జరుగుతుంది అమ్మవారి ప్రీతి పాత్రమైన రోజు కార్తీక మాసం చివరి  అమావాస్య కావడం  సందర్భంగా శ్రీ భగలాముఖి అమ్మవారి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి సన్నిధిలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

అమ్మవారి ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించగా ఆలయ భూదాత పబ్బస్వరూప రమేష్ గుప్తా పలువురు భక్తులు పెద్ద ఎత్తున యజ్ఞం పాల్గొనగా  ఆలయ ట్రస్టు చైర్మన్ ఉపాసకులు బ్రహ్మశ్రీ  శాస్త్రుల లక్ష్మి వెంకటేశ్వరశర్మ పండితులు కామారెడ్డి ఆంజనేయ శర్మ అర్చకులు కమలేష్ పండిట్ శర్మ ఆధ్వర్యంలో  భగలాముఖి అమ్మవారికి మహా మంత్రహవనం  మహాపూజ అర్చన పంచామృతలతో అభిషేకం హరిదార్చన హవనం  పూర్ణాహుతితో విశేష పూజలతో ముగించారు వచ్చిన భక్తులకు పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి యొక్క విశేషాలు తెలియజేసి  తీర్థప్రసాదాలు అందజేశారు కార్తీకమాసం చివరి అమావాస్య సందర్భంగా మాజీ ఎంపీ మధు యాస్కీగౌడ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్  పాల్గొన్నారుఆలయ  ప్రాంగణంలో కీర్తిశేషులు పబ్బ రామమ్మ అంజయ్య గుప్త వారి స్మారకార్థం కుటుంబ సభ్యులు పబ్బ స్వరూప రమేష్ గుప్త పబ్బ స్వాతి మహేష్ గుప్తా రమాదేవి తిరుపతిరెడ్డి  అన్నదాన కార్యక్రమాన్ని  వచ్చిన భక్తులకు వివిధ రకాల తో తయారు చేసిన అన్నదానం  వితరణ చేశారు.

వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరించారు  భక్తులకు  షామియానాలు  ఏర్పాటు చేసి శుద్ధమైన  త్రాగునీరు ఏర్పాటు చేశారు  ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులుశాస్త్రుల పురుషోత్తమ శర్మ వెంకటరమణ శర్మ  జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్  పబ్బా మహేష్ గుప్తా పత్రాల శ్రీనివాస్ గౌడ్ మరియు వ్యాపారవేత్త  రంగా సురేష్ గుప్తా  శ్రీకాంత్ గుప్తా, నందకుమార్ లక్ష్మీ నరసయ్య  బాసంపల్లి పోచగౌడ్ కొండల్  బి.రామాగౌడ్  త్రినేష్ గౌడ్  యం. రాజు అశోక్ నవీన్ రమేష్ రాజీపేట రాములు, కిషన్  పీఎంజి యువసేన సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కోలాహలంగా మారింది కిలోమీటర్ మేర ట్రాఫిక్ వల్ల వాహనాలు నిలుపుకొని భక్తులు నడుచుకుంటూ అమ్మవారి ఆలయానికి వచ్చారు ఆలయం తరపున వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించారు మహిళా భక్తులు బెంగళూరు చెన్నై హైదరాబాద్ తదితర సుదిరా ప్రాంతాల నుండి అమ్మవారి దర్శన నిమిత్తం రావడం జరిగింది