calender_icon.png 20 November, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలవత్ పూర్ణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

20-11-2025 08:40:39 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ  మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామాన్ని సందర్శించారు. పర్వతారోహకురాలు మాలవత్ పూర్ణ గారి తండ్రి మాలవత్ దేవిదాస్  ఇటీవల మరణించటంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపాతి రెడ్డి ఆమె వెంట ఉన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలావత్ పూర్ణ ఇంటర్ పేద కుటుంబమని కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన కుటుంబమని ఆ కుటుంబంలో మలవత్పూర్ణ తండ్రి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది అన్నారు. మల్లావాత్ పూర్ణకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండదండలుగా నిలుస్తుందని అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క ధైర్యం చెప్పి ఓదార్చారు. ఆమె వెంట అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీతారా కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.