20-11-2025 08:29:12 PM
మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా వెంటనే పనులను ప్రారంభించాలని కోరుతూ దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్ గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు, ఎంపీ సురేష్ హెడ్కర్ కు వినతి పత్రం అందజేసినట్లు మాజీ జెడ్పిటిసి తీగలు తిరుమల గౌడ్ తెలియజేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 తారీకు న 50 పడకల ఆసుపత్రిగా మార్చుటకు తెలంగాణ ప్రభుత్వం ఫైనాన్స్ అనుమతి చేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న ఆసుపత్రిలో 50 పడగల ఆసుపత్రిని నిర్వహించుటకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమకొండ లోని 10 పడకల ఆసుపత్రి నుండి 30 పడకల వరకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అభివృద్ధి పరచాడని. ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రి సైతం షబ్బీర్ అలీ మంజూరు చేయించాడని తెలిపారు. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రి పై భాగంలో అదనపు గదులు నిర్మించే పనులు వెంటనే ప్రారంభించాలని ఆయన కోరారు. 50 పడకల ఆసుపత్రికి సరిపడే సిబ్బందిని సైతం భర్తీ చేయాలని మంత్రి సీతక్కకు, ఎంపీ సురేష్ హెడ్కర్ కు, షబ్బీర్ అలీకి వినతి పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, శంకర్ రెడ్డి నయీమ్, నాయకులు తదితరులున్నారు.