రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
23-08-2024 02:10 PM
రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఉదయం చతుష్షష్టి ఉపచారములతో విశేషపూజలు, శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి అభిషేకం,ఆర్చన, శ్రీ మహాలక్ష్మీ హోమము చేపట్టారు. రేవతి నక్షత్రం సందర్భముగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి ఉదయం పంచోపనిషద్వారా అభిషేకము నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు






