6 August, 2026 | 12:36 AM

సప్తగిరి కోదండరామాలయంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు భూమి పూజ చేసిన మేయర్

23-08-2024 02:08 PM

 ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లింపు

కరీంనగర్: కమ్యూనిటీ భవనాలు ఉంటే డివిజన్ ప్రజలందరికి సౌకర్యకరంగా ఉంటాయని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం రోజు 14,35 వ డివిజన్ల పరిదిలో పర్యటించారు. సప్తగిరి కాలనీ కోదండరామాలయంలో స్థానిక కార్పోరేటర్లు దిండిగాల మహేష్, బుచ్చిరెడ్డిలతో కలిసి 26.50 లక్షల నిధులతో కమ్యూనిటి భవనం నిర్మాణం కు భూమి పూజ చేశారు.

అనంతరం రామాలయంలో సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుచున్నారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... నగరంలో కమ్యూనిటి భవనాల నిర్మాణం కు ప్రజలు, కార్పోరేటర్ల ద్వారా వచ్చిన వినతుల మేరకు సంబంధిత డివిజన్ లలో కమ్యూనిటి హాల్స్ భవనాల సమస్యను సాధ్షమైనంత వరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణం చేసే ప్రతి కమ్యూనిటి హాల్ భవనాలు స్థానిక ప్రజలకు సౌకర్యకరంగా ఉండేలా చర్యలు తీస్కోవడం జరుగుతుందని తెలిపారు. శుభకార్యాల సమయంలో స్థానిక ప్రజలకు ఎలాంటి భారం లేకుండ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కు వెల్లకుండా నిర్మాణం చేసిన కమ్యూనిటి భవనాల్లో కార్యక్రమాలు చేస్కోవచ్చని తెలిపారు.

ఇప్పటికీ నగరంలో చాలా డివిజన్ లలో కమ్యూనిటి భవనాలు నిర్మాణం చేయడం జరిగిందని... ప్రస్తుతం సప్రగిరి కాలనీ కోదండరామాలయంలో కూడ కమ్యూనిటి హాల్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. సప్తగిరి కాలనీ పెద్దగా విస్తరించిన ప్రాంతం కాబట్టి కమ్యూనిటి భవనం నిర్మాణం చేస్తే సౌకర్యంగా ఉంటుందని బావించి భవన నిర్మాణం కు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. వచ్చే ఐదు మాసాల్లో భవన నిర్మాణం పనులు పూర్తి చేసి రామలయంకు వచ్చే భక్తులతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలొ కార్పోరేటర్ వాల రమణ రావు, రామాలయ కమిటీ అధ్యక్షులు గౌతంబాబు, మాజీ కార్పోరేటర్ రమేష్ రెడ్డి, స్థానిక ఆలయ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.