10 June, 2026 | 1:34 AM

హుజురాబాద్ డివిజన్‌లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి

10-06-2026 12:00 AM

సీపీ గౌష్ ఆలం

హుజురాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): హుజురాబాద్ సబ్ డివిజన్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీసీటీఎన్‌ఎస్ 2.0, ఈ-సాక్ష్య యాప్లలో కేసుల పూర్తి వివరాలను జూన్ 15లోగా అప్లోడ్ అని సూచించారు.

నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వలస కార్మికుల పూర్తి వివరాలను పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని, కార్డన్ అండ్ సెర్చ్, వాహన తనిఖీలు, పాత నేరస్థులపై నిఘా మరింత పెంచాల నీ సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక పోలీస్ డాగ్స్, డ్రగ్ టెస్ట్ కిట్లతో తనిఖీలు నిర్వహించాలి. మహిళల భద్రత కోసం ‘షీ లీడ్స్’, ‘స్నేహిత’ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

పనిచేయని సీసీ కెమెరాలను తక్షణమే పునరుద్ధరించాలి..

హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణపై సీపీ సంతృప్తి వ్యక్తం చేస్తూ భేష్ అని అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సిఐలు కరుణాకర్, రామకృష్ణ గౌడ్, వెంకట్, శ్రీనివాస్ ఎస్‌ఐలు స్వాతి ఆవుల తిరుపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.