చొప్పదండిలో ప్రతి గ్రామానికి బస్సు నడపాలి
ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, జూన్ 9 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆర్టీసీ అధికారులకు సూచించారు. మంగళవారం కరీంనగర్లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి రాజుతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏ గ్రామానికీ సరైన బస్సు సౌకర్యం కల్పించలేదని, ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న కెనాల్లపై అల్యూమినియం సేఫ్టీ వాల్స్ను వెంటనే నిర్మించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
నిలిపివేసిన మోడల్ స్కూల్ బస్సులు, నైట్ హాల్ట్ బస్సులను తక్షణమే పునరుద్ధరించాలని, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు అవసరమైన చోట్ల కొత్త బస్ స్టాప్లు ఏర్పాటు చేయాలని, అన్ని బస్ స్టేషన్లు, బస్ స్టాప్ల వద్ద తాగునీరు, టాయిలెట్లు ఉండేలా చూసుకోవాలని కోరారు. స్కూళ్లు, కాలేజీల సమయాల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా బస్సులు నడపాలన్నారు.
అలాగే జగిత్యాల నుండి పెగడపల్లి వయా తక్కల్లపల్లి, మనాల, జగిత్యాల నుండి వేములవాడ వయా రాజారాం, పోతారం, రామన్నపేట, నూకపల్లి, మల్యాల ఎక్స్ రోడ్, జగిత్యాల నుండి కరీంనగర్ వయా రాంపూర్, ఓబులాపూర్, గొర్రెగూడెం, రామ్సాగర్, కొడిమ్యాల్, కరీంనగర్ నుండి గంగాధర వయా బురుగుపల్లి, లింగంపల్లి, ర్యాలపల్లి, చెర్లపల్లి, కుర్మపల్లి, కొండాయపల్లి, చెర్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, కరీంనగర్ నుండి బావుపేట వయా నాగుల మల్యాల, ఆచంపల్లి, చిన్న ఆచంపల్లి, గర్షకుర్తి, తాటిజెర్రి, ఉప్పరమల్లియల్, కురిక్యాల గంగాధర బ్లాక్, కరీంనగర్ నుండి గోపాల్రావుపేట నుండి ముప్పడిపల్లి వయా పెండలానిపల్లి, సర్వారెడ్డిపల్లి, మర్రిగడ్డ, నర్సింహులపల్లి, కరీంనగర్ నుండి గంగాధర బ్లాక్ వయా బురుగుపల్లి, తిమ్మలాపూర్, నర్సింహులపల్లి, మర్రిగడ్డ, సర్వారెడ్డిపల్లి, పెండలానిపల్లి, ముప్పడిపల్లి, కరీంనగర్ నుండి కొదురుపాక, జగ్గారావుపల్లి, దేశాయిపల్లి వయా బోయినపల్లి, కరీంనగర్ నుండి గోపాల్రావుపేట వయా: చొప్పదండి, మంగళపల్లి, కరీంనగర్ నుండి కత్నపల్లి వయా గుమ్లాపూర్, సత్రాజ్పల్లి, వేములవాడ నుండి కరీంనగర్ వయా రామన్నపల్లి, దేశాయిపల్లి, మార్లపేట, గర్షకుర్తి, ఆచంపల్లి, గట్టుబూత్కూర్, గుడ్డేలుగులపల్లి, వెలిచాల, వేములవాడ నుండి నల్లగొండ, మల్లాపూర్, మల్కాపూర్, తిప్పయపల్లి వయా గంగాధర, కరీంనగర్ నుండి విలాసాగర్ వయా: మార్లపేట, బోయినపల్లి, పుదూర్ నుండి గౌరాపురం, నర్సింహులపల్లి రూట్లలో బస్సు సర్వీసులను త్వరలో ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆర్టిసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ రీజనల్ ఆఫీసర్ భూపతి రెడ్డి, వన్ డిపో మేనేజర్ విజయ మాధురి పాల్గొన్నారు.






