అర్హులైన ప్రతి పేదవానికీ ఇందిరమ్మ ఇళ్లు
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూన్ 9(విజయక్రాంతి): పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి పేదవానికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజక వర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 66 మంది లబ్ధిదారులకు రూ.66,07,656 విలువైన చెక్కులను అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... పదేళ్ల గత పాలనలో పేదలకు ఇళ్లు దక్కకుండా మోసం జరిగిందని విమర్శించారు. నేడు ప్రజా ప్రభుత్వం ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేసి, పేదల సొంతిం టి కలను నిజం చేస్తోందని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు చేయగా, జూన్ చివరి నాటికి అదనంగా మరో 2,000 ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, మృగశిర కార్తె ప్రవేశించినందున రైతులు తక్షణమే నార్లు పోసు కోవాలని సూచించారు. పంట దిగుబడి తగ్గకుండా 105 రోజుల్లో చేతికొచ్చే వరి రకాల ను ఎంచుకోవాలని కోరారు.
వరికి బదులుగా పత్తి, మొక్కజొన్న, కందులు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి మద్దతు ధర కల్పిస్తామని భరో సా ఇచ్చారు. కేంద్రం మొండి చేయి చూపినప్పటికీ, రైతులకు భారం కాకూడదనే ఉద్దేశం తో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని తెలిపారు. తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విజయరమణ రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాముడు, ఎంపీడీవో దివ్య దర్శన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.






