31 March, 2026 | 5:28 PM

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

07-12-2024 03:14 AM

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ నుంచి శబరిమళకు 22 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు ఈ నెల 13 నుంచి 2025 జనవరి 26వ తేదీ వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

* ఈ నెల 13న హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.05 నిమిషాలకు ప్రత్యేక రైలు (నం.07137) బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. ఇదే రైలు (నం.07138) కొట్టాయం నుంచి ఈ నెల 14న రాత్రి 9.45 గంటలకు బయలుదేరి 16వ తేదీ అర్ధరాత్రి 12.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. 

* ఈ నెల 20, 27 తేదీల్లో హైదరాబాద్ నుంచి (రైలు నం.07163) మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.45 గంటలకు కొట్టాయం చేరుకుంటాయి. కొట్టాయం నుంచి ఇవే రైళ్లు (రైలు నం.07164) ఈ నెల 21, 28 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు బయలుదేరి 23, 30 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయి. 

* ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 8.50 గంటలకు కొట్టాయం నుంచి (రైలు నం. 07132) ప్రత్యేక రైళ్లు బయలుదేరి వరుసగా ఈ నెల 11, 18, 25, జనవరి 1వ తేదీన అర్ధరాత్రి 1.00 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు వస్తాయి. 

* జనవరి 3, 10 తేదీల్లో నాందేడ్ నుంచి వరంగల్ మీదుగా కొల్లాంకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇవే రైళ్లు తిరుగు ప్రయాణంలో వచ్చే నెల 5, 12వ తేదీల్లో కొల్లాం నుంచి బయలుదేరి వరంగల్ మీదుగా వస్తాయి. 

* జనవరి 17, 24వ తేదీల్లో ఉదయం 10.40 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరి వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు కొల్లాం చేరుకుంటాయి. అవే రైళ్లు కొల్లాం నుంచి జనవరి 19, 26వ తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటాయి. 

* నాందేడ్ నుంచి కొల్లాం వెళ్లే ప్రత్యేక రైళ్లు ముద్కేడ్, బాసర, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, విజయవాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి. 

*సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలుదేరే రైళ్లు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, విజయవాడ తదితర స్టేషన్లలో ఆగనున్నాయి. 

*హైదరాబాద్, కాచిగూడ, సికిందరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, మౌలాలి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, రేణిగుంట, కాట్పా డి జంక్షన్ తదితర స్టేషన్లలో ఆగుతాయి. 

* హైదరాబాద్ నుంచి బయలుదేరే (రైలు నం.07163 మరియు 07164) రైళ్లు మాత్రం బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గిర్, కృష్ణా, రాయిచూరు, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, పాకాల, కాట్పాడి జంక్షన్ మీదుగా కొట్టాయం చేరుకుంటాయి.