25 April, 2026 | 2:54 AM

ఇళ్ల నిర్మాణం శరవేగంగా చేయండి

02-07-2025 12:03 AM

- గృహ నిర్మాణదారులకు ప్రోత్సహించండి 

- జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహమ్మదాబాద్ జూలై 1 : ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణం చేస్తున్న లబ్ధిదారుల ను వేగంగా నిర్మాణం పూర్తయి ఎ లా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నా రు. మంగళవారం మహమ్మదాబాద్ మండలం చిన్నాయి పల్లి గ్రామం లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో 140 ఇండ్లు మంజూరు కాగా, 96 మార్కౌట్ చేసినట్లు, 43 ఇండ్లు బేస్మెంట్ వర కు,20 ఇండ్లు గోడల వరకు, 8 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఇందిరమ్మ గృహ నిర్మాణం చేసుకున్న లబ్ధిదారురాలు లక్ష్మీతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్ని చదరపు అడుగులలో నిర్మించారు అని కలెక్టర్ అడిగారు.400 చదరపు అడుగులలో నిర్మించినట్లు లబ్దిదారురాలు తెలిపారు.- తహశీల్దార్ కార్యాలయం ను తనిఖీ చేసిన కలెక్టర్‌మండల తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చెదరి కార్యాలయంలో వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

తహశీల్దార్ కార్యాలయం లో భూ సమస్యలు,ఆదాయ, కుల ధృవీకరణ,ఇతరత్రా సమస్యలపై కార్యాలయం లో ఇచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించి పరిష్కారం చేస్తారని,కార్యాలయం చుట్టూ తిరగవలసిన అవసరం లేదని తెలిపారు.జిల్లా కలెక్టర్ తో పాటు గృహ నిర్మాణ పి.డి.వైద్యం భాస్కర్,తహశీల్దార్ విద్యా సాగర్ రెడ్డి,ఎం.పి.డి. ఓ నరేందర్ రెడ్డి,మండల,గ్రామ అధికారులు ఉన్నారు.