02-07-2025 12:03:10 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, జూలై 1 (విజయ క్రాంతి): ఆయిల్ పామ్ పంట సాగుతో అన్నదాతలు అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. కురవి మండలం బలపాల గ్రామంలో మంగళవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మెగా మేళాలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ముఖ్య అతిదిగా పాల్గొని ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో 8,000 ఎకరాల పైగా పామాయిల్ సాగు అవుతుందని, 1,350 ఎకరాలలో పామాయిల్ గెలలు దిగుబడి మొదలై ప్రతి రైతు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారన్నారని కలెక్టర్ కు వివరించారు. ఈ సంవత్సరానికి గాను 4,500 ఎకరాల లక్ష్యంతో ఇప్పటి వరకు 663 ఎకరాలలో మొక్కలు నాటడానికి రైతులు ముందుకు వచ్చారని చెప్పారు.
బోర్ల క్రింద ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, మల్బరీ, పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేయాలని మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగు గడప గడపకు ఆయిల్ పామ్ సాగు ఒక ఎకరానికి పామాయిల్ గెలల దిగుబడి పది టన్నులు ఒక ఎకరానికి లక్షకు పైగా ఆదాయం నెలనెలా స్థిరమైన ఆదాయం ఆయిల్ పామ్ తోనే సాధ్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు బజ్జూరి పిచ్చిరెడ్డి, బజ్జూరి ఉమా, యం. రమేష్, హనుమంత రావు, చంద్రారెడ్డి, ఏడిఎ శ్రీనివాస్, ఏవో నరసింహ రావు, ఉద్యాన అధికారి శాంతి ప్రియ, ఏఈవో లయ, టి. జి. ఆయిల్ ఫెడ్ క్షేత్ర సిబ్బంది నాగరాజు, జి. చంద్ర ప్రకాష్, కార్యాలయ సూపరింటెండెంట్ ఆర్. శ్రీనివాస రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి హరి, బిందు సేద్య ప్రతినిది ఆగస్టిన్, కె. శంకర్ తదితరులు పాల్గొన్నారు.